BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

మండల పరిషత్ ఎంపీపీ రేసులో అభ్యర్థులు వీరే..

Select Suryaa Now
మండల పరిషత్ ఎంపీపీ రేసులో అభ్యర్థులు వీరే..

కె గంగవరం మేజర్ న్యూస్ :మండల పరిషత్ పరిధిలో 18 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎంపీపీ పదవిని టీడీపీ, వైకాపా, జనసేన పార్టీ అభ్యర్థులు ఆశిస్తున్నారు. దంగేరు గ్రామం నుండి వైకాపా తరపున పోటీ చేస్తున్న రావిపాటి సత్యకృష్ణ, శివల  ఎంపీటీసీగా పోటీ చేస్తున్న చుండ్రు సూర్యకుమారి, కుడుపూరు నుండి పోటీ చేస్తున్న రావుపాటి వెంకట గణేష్ చౌదరి, జనసేన నుండి సత్తి శ్రీకృష్ణనారాయణ తమ నామినేషన్లు దాఖలు చేసి పార్టీ అగ్ర నాయకులను ముఖ్య కార్యకర్తలు పార్టీ ఇన్చార్జిలవద్దకు తీసుకెళ్లి మద్దతు కోరుతున్నారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి ఎంపీపీ దక్కించుకుంటారు. 18 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 92 నామినేషన్లు వచ్చాయి. ఎండిఓ కార్యాలయానికి నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ నామినేషన్ పరిశీలన కార్యక్రమానికి రావాలని ఎన్నికల అధికారి పి.శ్రీనివాస్, ఎండిఓ ఎన్.శ్రీనివాస్ పేర్కొన్నారు.  కే.గంగవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద పామర్రు ఎస్సై జి సోమేంద్ర తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 144 సెక్షన్ విధించామని గుంపులుగా ఎవరు తిరగరాదని ఎస్సై విజ్ఞప్తి చేశారు.