మర్రిపాడులో 2 నామినేషన్లు దాఖలు
మర్రిపాడు మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలో జరగనున్న ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బూదవాడ సిగ్మెంటుకు సంబంధించి 2 నామినేషన్లు తొలిరోజు బుధవారం దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో నాగేశ్వరప్రసాద్ లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల పరిధిలోని ఏసుతోక వెంకటయ్య, ఏసుతోక రమేష్ లు వైసిపి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ మండల కేంద్రమైన మర్రిపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్ఐ బలరామిరెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.