మా ప్రాంత అభివృద్ధి కోసం మేఘలాదేవిని గెలిపిస్తాం మూడో సిగ్మెంట్ మహిళలు
కొయ్యలగూడెం. , రూరల్ మేజర్ న్యూస్ :గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మేకల దేవి ఎంపీటీసీ అభ్యర్థిగా మూడవ సిగ్మెంట్ లో పోటీ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కొయ్యలగూడెం పట్టణ మూడవ సిగ్మెంట్ లో ఉండే మహిళలు మేఘలాదేవిని ఆమె నివాసం వద్ద శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. మేఘాలాదేవితో సమావేశమైన మహిళలు మాట్లాడుతూ 1999 వ సంవత్సరంలో మేఘాల దేవి చేసిన అభివృద్ధిని మేము చూశామని ఆనాటి అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి వివరిస్తూ
ముచ్చటించారు . మహిళల పట్ల ఎంతో అంకితభావంతో టిడిపి పార్టీ ప్రారంభం నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని. మండల కేంద్రంలోనే కాకుండా సుదూర ప్రాంతాలలో కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరో మదర్ తెరిసాగా పేరుందారనే కొనియాడారు . తమ వార్డులలో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందడానికి మేమంతా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసి గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.