కుతుకులూరులో కూటమి అభ్యర్థులకు ప్రజాదరణ - ఎమ్మెల్యే నల్లమిల్లి.
అనపర్తి, మేజర్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుతుకులూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ పెద్దలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, కుతుకులూరులో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.