కోడి పల్లి ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా శ్రావణి నామినేషన్ దాఖలు
హిందూపురం: - శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండల పరిధిలోని కోడిపల్లి గ్రామపంచాయతీ నుండి వైయస్సార్సీపి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గా శ్రావణి శ్రీనివాస్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ,హిందూపురం వైసిపి ఇన్చార్జ్ దీపికా వేణు రెడ్డి ఆదేశాల మేరకు కోడిపల్లి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇస్తే కోడిపల్లి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడిపల్లి గ్రామపంచాయతీ వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర