BREAKING
తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి

కసునూరులో మెడికల్ కంపెనీ సందర్శించిన బీటెక్ రవి

Select Suryaa Now
కసునూరులో మెడికల్ కంపెనీ సందర్శించిన బీటెక్ రవి

సింహాద్రిపురం న్యూస్:

కసనూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్‌ను పులివెందుల టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందితో మాట్లాడి క్యాంప్‌లో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న పరీక్షలు, ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంప్‌కు వచ్చిన ప్రజలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ సహకారంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని బీటెక్ రవి గారు  తెలిపారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ఈ స్క్రీనింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
సింహాద్రిపురంలో అక్టోబర్ 6, 7 తేదీల్లో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ & మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీటెక్ రవి కోరారు.


పి. కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్