BREAKING
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలి ఎంపిటిసి నామినేషన్ల సజావుగానే సాగింది జంగంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి భక్త జనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం రావుపల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రావణి ప్రభాస్ బర్త్‌డే వేడుకల్లో ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్.. డార్లింగ్ పై ప్రత్యేక ప్రేమ! నాగిరెడ్డి పేటకు మహిళా సమైక్య భవనం మంజూరు ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లకు ప్రత్యేక షెడ్యూల్ విడుదల సరాక పరిశ్రమ ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం ఎండుతున్న వరి పంటలు విద్యార్థులకు కంటి పరీక్షలు బాలుడు వైద్యానికి రూ 25 వేలు సాయం నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల సాగు చేపట్టాలి - జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి చివరిరోజు 9 నామినేషన్ల దాఖలు.. పొన్నం చొరవకు కేంద్ర మంత్రి ప్రశంసలు

జోరు వానలోనూ ఆగని టీడీపీ ప్రచారం

Select Suryaa Now
జోరు వానలోనూ ఆగని టీడీపీ ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది.  రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి  తనయ లీలా కైవల్య రెడ్డి, ఎన్డీఏ కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని కొనసాగిస్తూ పట్టణంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.  ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలను ప్రజలకు వివరించారు.   డాక్టర్ షకీలా కు అడుగడుగునా ప్రజలు సన్మానాలు, పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికి జేజేలు పలికారు. అన్నివర్గాల నుండి ఆమెకు విశేషాదరణ లభిస్తోంది. ఆనం కైవల్యా రెడ్డి, డాక్టర్ షకీలా నిర్వహించిన ప్రచారం ముమ్మరంగా అత్యంత కోలాహలంగా సాగింది. అన్నివర్గాలవారు అనూహ్యంగా మంగళహారతులతో ఆహ్వానించి ఆశీర్వదించి మద్దతు తెలిపారు. వారి ప్రచారానికి విశేష స్పందన లభించింది.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుమహిళ నాయకురాలు పులిమి శైలజా రెడ్డి, ఆయా వార్డుల తెలుగుదేశం అభ్యర్థులు,స్థానిక  నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.