జోరందుకున్న నామినేషన్ల పర్వం
రణస్థలం, సూర్య : ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు( ఎన్ ఈ ఆర్ ) గురువారం తన సతీమణి బంటుపల్లి మాజీ సర్పంచ్ రజిని ఎన్ఈఆర్ బొంటుపల్లి గ్రామ ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా బుధవారం నుండి నామినేషన్ల పర్వం జరుగుతుందని అందులో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం లో ఉన్న నాలుగు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ క్రమబద్ధంగా ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషనర్ రాజకీయాలకు అతీతంగా ఏమి నామినేషన్ల ప్రక్రియ జరిపిస్తున్నారని అన్నారు. నా సొంత గ్రామమైన బంటుమిల్లి ఎంపీటీసీ స్థానానికి నా సతీమణి రజిని ఎన్ ఈ ఆర్ నామినేషన్ కు నేను హాజరయ్యానని అన్నారు. అన్ని గ్రామాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు వారు నామినేషన్లు దకల చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు లో నామినేషన్ వేసిన టిడిపి జనసేన బిజెపి తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ లంక శ్యామలరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులను కూటముగా ఉన్నటువంటి టిడిపి జనసేన బిజెపి నాయకులు ఆ గ్రామ పెద్దలతో కలిసి చర్చించి ఆయా స్థానాలకు ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు నియోజకవర్గంలో 175 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెట్టమని అన్నారు. కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజిక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పల్లా నీలయ్య, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా.