BREAKING
*స్వర్ణగిరిలో వైభవోపేతంగా పవిత్రోత్సవ సందడి!* తొలిరోజే 21 ఎంపీటీసీ నామినేషన్లు వాగ్వాదం.. లారీ కిందకు నెట్టి హత్య స్థానిక సంస్థల ఎన్నికల వేళ టిడిపిలోకి వలసల వెల్లువ జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి* చెరువులో పడి మహిళ మృతి 21వ డివిజన్ కూటమి అభ్యర్థిగా వెంకట సాయి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ చీపురుపల్లి లో కూటమికి బీటలు ....జనసేనకు 4 నుంచి ఆరు ఎంపీటీసీ స్థానాలు.....బీజేపీ కి మొండి చేయి.… టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆశావహులు వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా అల్లు విజయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూలిన గదులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి అమరుల త్యాగాలు మరువలేనివి:ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి కృషికి ఆకర్షితులై టీడీపీలో చేరాం పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధింపు.. సీఐ తిమ్మయ్య

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలన అధికారి డా. వరప్రసాద్

Select Suryaa Now
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలన అధికారి డా. వరప్రసాద్

తిరుపతి : 

తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలన అధికారి డా. ఎం. వరప్రసాద్ బుధవారం జిల్లాలోని పలు మండలాలు, కార్యాలయాలను సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను, తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రేణిగుంట, రామచంద్రపురం, వడమాలపేట, పుత్తూరు, నారాయణవనం, చంద్రగిరి మండలాల్లోని సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను సమీక్షించారు. అలాగే పుత్తూరు మున్సిపల్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఎన్నికల పరిశీలన అధికారి వెంట లైజన్ అధికారి జనార్ధన రెడ్డి పాల్గొన్నారు.