జడ్పీటీసీ అభ్యర్థిగా వాయిల కృష్ణవేణి ని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కావలి, మేజర్ న్యూస్ : మత్స్యకారులపై నమ్మకంతో రెండోసారి అవకాశం కల్పించిన ప్రతాప్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు: వాయిల తిరుపతి
కావలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి రూరల్ మండల కన్వీనర్ వాయిల తిరుపతి సతీమణి వాయిల కృష్ణవేణిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా వాయిల తిరుపతి మాట్లాడుతూ, మత్స్యకారులపై నమ్మకంతో తన సతీమణి వాయిల కృష్ణవేణికి రెండోసారి జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కావలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఐక్యంగా పనిచేసి, పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి వాయిల కృష్ణవేణి విజయానికి కృషి చేయాలని తిరుపతి కోరారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల్లో తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.