ఘనంగా దేవీ నవరాత్రులు ముగింపు
చీపురుపల్లి, సూర్య : పట్టణంలోని రుంకాన వీధిలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన దేవీ నవరాత్రులు బుధవారం తో ముగిసాయి. భవాని దీక్షాపరులు ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేసేందుకు భక్తుల ఆధ్వర్యంలో పయనమయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వంశీ, ఇప్పిలి తిరుమల, ఆర్ రామారావు, అప్పికొండ ఆదిబాబు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.