గుంటూరులో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
గుంటూరు మేజర్ న్యూస్ ;పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును అమరావతి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.నామినేషన్ల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా గుంటూరు జెకెసీ కళాశాల రోడ్డులో ఉన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నివాసానికి ఎస్సై జె.ఎస్.రావు చేరుకొని మాజీ ఎమ్మెల్యేకు విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.నామినేషన్ల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.