ఎంపిటిసి అభ్యర్థులుగా 15 మంది నామినేషన్
ఎంపిటిసి స్థానాలకు 15 నామినేషన్ లు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 15 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు. మండలంలో మొత్తం పది ఎంపిటిసి స్థానాలు ఉండగా ఉరుకుంద -1, కురుకుంద -2 ఎంపిటిసి స్థానాలకు 8 నామినేషన్లు, ముస్తపల్లి, కరివేన, నల్ల కాలువ, కృష్ణాపురం, పిన్నాపురం, శ్రీపతిరావు పేట గ్రామాల ఎంపిటిసి స్థానాలకు ఒకటి చొప్పున మొత్తం 15 నామినేషన్లు తెలుగుదేశం పార్టీ నుంచి దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. నేటితో ఎంపిటిసి నామినేషన్ల ప్రక్రియ ముగియనున్నట్లు తెలిపారు.