andhrapradesh
ఎంపీటీసీ కు ఘన సన్మానం.
Andhrapradesh
10 Nov 2026
31 views
దౌర్జన్యం మెడలు వంచిన ప్రజాస్వామ్యం - టిడిపి నేత
డా.యం.ఉమేష్ రావు,
పొట్టంబేడు ఎంపీటీసీ ఆనందమును తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, గత కొన్ని దశాబ్దాలుగా దాడులు, దౌర్జన్యాలను ఆసరాగా చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వైయస్ కుటుంబ నియంతృత్వం సృష్టించిన అడ్డంకులను అధిగమించి, వెన్ను చూపకుండా ఎదిరించి పులివెందుల దౌర్జన్యం మెడలు వంచిన ప్రజాస్వామ్యానికి వేల వేల దండాలు సమర్పిస్తున్నామని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు తెలిపారు.
*సామాజిక న్యాయం టిడిపితో సాధ్యం* స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీతో సామాజిక న్యాయం, పేదలకు రాజ్యాధికారం సాధ్యమని భావించి, గడచిన నాలుగు దశాబ్దాలుగా త్రికరణ శుద్ధిగా బలహీన వర్గాలకు ప్రజా ప్రతినిధులుగా అవకాశాలు కల్పిస్తున్నదని కొనియాడారు. ఇదే క్రమంలో సియం చంద్రబాబు నాయుడు కూడా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం అందించేలా, ప్రస్తుతం జరిగిన పురపాలక ఎన్నికలలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నిక కాబడిన మొత్తం 70 మంది ఛైర్మన్ మరియు మేయర్ లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ప్రత్యేకించి బీసీ వర్గానికి చెందిన వారికి 35.7 శాతంతో దాదాపు 25 పదవులు కేటాయించడం సామాజిక, రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయ ఘట్టం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తొట్టంబేడు ఎంపిటీసి చిల్లకూరు ఆనందమ్మ, శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, డిల్లీ బాబు, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, తిరుపతి పార్లమెంటు నాయకులు సయ్యద్ చాంద్ బాషా, శంకరయ్య, సులేమాన్, గాజుల భగత్, గగన్ యాదవ్, ముని, భువన, అయ్యప్ప, చంద్రబాబు, సుబ్బు, రాకేష్, శివ, గోపీ యాదవ్, నాగరాజు, సుబ్బయ్య, రవితేజ, బాలు, శీను తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఎంపీటీసీకి దేశం నాయకులు సన్మానం
ట్యాగ్లు:
Latest News