ఎంపీటీసీ ఎన్నికల నోటీసు జారీ
బాడంగి, సూర్య : బాడంగి మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నోటీసును బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. మహారాజన్, ఎంపీడీవో డి.వి. శ్రీలత ఆధ్వర్యంలో ఈ నోటీసును జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల విద్యాశాఖ అధికారి పి.లక్ష్మణ దొర, డిప్యూటీ ఎంపీడీవో దేవకుమార్, టైపిస్ట్ వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు జి.జీవరత్నం, సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.