డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రవిశంకర్
డిప్యూటీ సీఎం పవన్ తో రవిశంకర్
వేంపల్లె మేజర్ న్యూస్:
జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు శంకుస్థాపన చేసేందుకు జిల్లాకు విచ్చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని జనసేన సీనియర్ నేత దాసరి రవిశంకర్ కలిశారు. సోమవారం ప్రొద్దుటూరుకు విచ్చేసిన ఆయన్ని సాదరాభిమానంగా ఆహ్వానం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే ఎ
ఏపి సిఎం చంద్రబాబు, డిసిఎం పవన్ కళ్యాణ్ ల చేతుల మీదుగా ఆ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సంతోషకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కీలకంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోందని, ప్రజల ఆరోగ్యం, సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రవిశంకర్ వెల్లడించారు. ఓ వైపు ప్రజా సంక్షేమ పాలన మరోవైపు రాష్ట్రాభివృధ్ధి, రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని తెలిపారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.