డాక్టర్ జగదీష్ కు అభినందనలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ ను బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆట్రిసోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, గణపతి సచ్చిదానంద స్వామీజీ అవధూత దత్త పీఠం శ్రీకృష్ణ అభినందించారు. స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి డాక్టర్ జగదీష్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్విమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జగదీష్ పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి, టీటీడీకి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్