చెరువుల వద్దకు పిల్లలు వెళ్లొద్దు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ హసీనా సుల్తానా.
పరిగి మేజర్ న్యూస్: దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, కాలువలు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పరిగి తహసీల్దార్ హసీనా సుల్తానా సూచించారు. పరిగి చెరువును పోలీసులతో కలిసి తనిఖీ చేసి, లోతైన గుంతలు ఉన్నందున గ్రామంలో దండోరా వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సిబ్బంది చెరువు వద్ద నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి దసరా పండుగను సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.
నవీన్ పరిగి సూర్య రిపోర్టర్