BREAKING
వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు

బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై సమగ్ర విచారణకు వినతి

Select Suryaa Now
బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై సమగ్ర విచారణకు వినతి

బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై సమగ్ర విచారణకు వినతి

విచారణ పూర్తయ్యే వరకు ఈవోపై చర్యలు తీసుకోవాలని వినతి.. టెండర్‌దారుడిపై దాడి ఘటనపైనా విచారణ కోరిన వెంకట్ యాదవ్

మదనపల్లె: బోయకొండ గంగమ్మ దేవస్థానంలో టెండర్ ప్రక్రియకు సంబంధించి కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చౌడపల్లికి చెందిన ఓ. వెంకట్ యాదవ్ తెలిపారు.

సోమవారం మదనపల్లెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం ఈవో ఏకాంబరంపై వచ్చిన ఆరోపణలను అధికారులు పరిశీలించి, విచారణ పూర్తయ్యే వరకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే టెండర్‌దారుడిపై జరిగినట్లు చెబుతున్న దాడి ఘటనపై కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

టెండర్ ప్రక్రియకు ముందే సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయనే ఆరోపణలు ఉన్నాయని, ఈ అంశంపై సంబంధిత వర్క్ ఆర్డర్లు, బిల్లులు, పనుల పురోగతి వివరాలను అధికారులు పరిశీలించాలని కోరినట్లు తెలిపారు. ఆరోపణల్లో వాస్తవం ఎంతవరకు ఉందో అధికారిక విచారణ ద్వారా నిర్ధారించాలని పేర్కొన్నారు.

అదేవిధంగా దేవస్థానంలో వసూలు చేస్తున్న టోల్ రుసుములకు సంబంధించిన లెక్కలు, ఆదాయ-వ్యయ వివరాలను కూడా పరిశీలించాలని కోరారు. ఆలయ టెండర్ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ లేదా ఇతర అనవసర జోక్యానికి అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు వెంకట్ యాదవ్ తెలిపారు.

తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.