BREAKING
న్యూపోర్ట్‌ పరిధిలో విద్యార్థిని అదృశ్యం: ఆందోళనలో తల్లిదండ్రులు పెడన నియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ -- కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అభ్యర్థుల ప్రకటన - శొంఠి నాగరాజు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రభుత్వ ఉద్యోగి మృతి. *స్వర్ణగిరిలో వైభవోపేతంగా పవిత్రోత్సవ సందడి!* తొలిరోజే 21 ఎంపీటీసీ నామినేషన్లు వాగ్వాదం.. లారీ కిందకు నెట్టి హత్య స్థానిక సంస్థల ఎన్నికల వేళ టిడిపిలోకి వలసల వెల్లువ జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి* చెరువులో పడి మహిళ మృతి 21వ డివిజన్ కూటమి అభ్యర్థిగా వెంకట సాయి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ చీపురుపల్లి లో కూటమికి బీటలు ....జనసేనకు 4 నుంచి ఆరు ఎంపీటీసీ స్థానాలు.....బీజేపీ కి మొండి చేయి.… టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆశావహులు వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా అల్లు విజయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూలిన గదులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి

బూర్వంచను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా - టిడిపి నేత కాపా శ్రీనివాసరావు

Select Suryaa Now
బూర్వంచను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా   - టిడిపి నేత కాపా శ్రీనివాసరావు

నూజివీడు, మేజర్ న్యూస్ : మండలంలోని బూర్వంచ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బూర్వంచ ఎంపీటీసీ కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ముందుగా రావిచర్ల గ్రామం నుండి భారీ స్థాయిలో ర్యాలీగా ఎంపీపీ కార్యాలయం కు చేరుకున్నారు.   ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో గడచిన రెండు నెలల కాలంలో నూజివీడు నియోజకవర్గం వివిధ రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ఘనత మంత్రి పార్థసారథికే దక్కుతుందని అన్నారు. రావిచెర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గా పనిచేసే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత దక్కిందని వివరించారు. ఇదే తరహాలో బూర్వంశ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన బిజెపి నాయకుల సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించి గెలిపించాలని కాపా శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త మరీదు శివరామకృష్ణ,  అధ్యక్షులు వాసు తో పాటు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 టీవీఎస్ ప్రసాద్, రిపోర్టర్, నూజివీడు