BREAKING
ఆలూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్! ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

భారీగా టీడీపీలోకి చేరికలు .....చీపురుపల్లి టౌన్ లో 100 కుటుంబాలతో చేరిక.…

Select Suryaa Now
భారీగా టీడీపీలోకి చేరికలు  .....చీపురుపల్లి టౌన్ లో 100 కుటుంబాలతో చేరిక.…

చీపురుపల్లి మేజర్ న్యూస్:

రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి-సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చీపురుపల్లి టౌన్‌లో  వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రౌతు కాము నాయుడు, టౌన్ అధ్యక్షులు గవిడి నాగరాజు  ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సువ్వాడ అప్పలనాయుడు, లెంక అప్పలనాయుడు, సారిక జగదీశ్ లతో పాటు ఏకంగా 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.  శాసనసభ్యులు  కిమిడి కళావెంకటరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు వీరికి పార్టీ కండువాలు కప్పి సాధరంగ ఆహ్వానించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా నిలిచిందని, పార్టీ నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. అలాగే గరివిడి మండలం తాటిగూడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, మాజీ ఎంపీటీసీ శనపతి సన్యాసి,  చైర్మన్ గంట్యాడ పైడి నాయుడు ఆధ్వర్యంలో యడ్ల త్రినాథ, వసంత, పైడి నాయుడు, వాసు, సత్యనారాయణ, జనార్దన, రమేష్ తో పాటు 10 కుటుంబాలు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా