BREAKING
ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్ పెరుగుతున్న వ్యాపార విశ్వాసం జర్మనీ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన ప్రముఖ పరిశోధనా సంస్థలు తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిటీ వంటనూనెల దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార హాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?nayanthara-kavin-starrer-hi-movie-ott-release-date-zee5 సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు మర్యాదపూర్వకంగా,నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలి ఉచిత మల్టీమీడియా న్యూస్ ఫీడ్‌గా ప్రాచుర్యం పొందుతున్న ప్రసార భారతి 'పిబిశబ్ద' మాడ్గులలో ఘనంగా cm సతీమణి జన్మదిన వేడుకలు మిక్స్డ్ టీమ్ స్కీట్‌లో భారత్‌కు కాంస్య పతకం రోడ్ల రిపేర్లకు రూ.251 కోట్లు భారీ వర్షాలకు పోటెత్తిన కేశవరం గని పోతురాజు చెరువు ఐరోపా బ్యాంకింగ్ విచ్ఛిన్నం నంద్యాలలో 'శిల్పా మహిళా సహకార బ్యాంక్' ప్రారంభం -మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి

బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం*

Select Suryaa Now
బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం*

 బాలల హక్కుల పరిరక్షణకు విద్యార్థి సంఘాల వినతిపత్రం*

అనంతపురం బ్యూరో 

 

 

: కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలబాలికల భద్రత, సంరక్షణ, విద్యా హక్కులు, మౌలిక వసతులు తదితర అంశాలపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి బాబు,చల్లా మధుసూదన్ రావుకు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల  ప్రతినిధులు PDSUజిల్లా ప్రధానకార్యదర్శి వీరేంద్ర ప్రసాద్,AIFDS రాష్ట్రఅధ్యక్షులు సీఎం సిద్దు,MSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సుదర్శన్ మాట్లాడుతూ,విద్యాసంస్థల్లో చదువుతున్న బాలబాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం యాజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు.

పాఠశాల భవనాల భద్రత, తరగతి గదుల పరిస్థితులు,తాగునీరు, మరుగుదొడ్లు,పారిశుధ్యం, ఆటస్థలాలు,రవాణా సౌకర్యాలు, అగ్నిమాపక భద్రత వంటి అంశాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.అలాగే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, విద్యార్థులపై ఒత్తిడి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ, భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి,వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని కోరారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లోకూడాబాలబాలికలకు అవసరమైన మౌలిక వసతులు,పరిశుభ్రమైన వాతావరణం,సురక్షితమైన తరగతి గదులు, తగిన సిబ్బంది మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలనివిజ్ఞప్తిచేశారు.బాలలపై ఏ రూపంలోనైనా వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం చోటుచేసుకుంటే వెంటనే స్పందించే విధంగా ఫిర్యాదు వ్యవస్థను బలోపేతం చేయాలని,విద్యార్థులసమస్యలను గోప్యంగా స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధానం ఉండాలని కోరారు.బాలల హక్కుల పరిరక్షణ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రతి విద్యాసంస్థలో ఆచరణలో కనిపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులుకోరారు.వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి, బాలబాలికల భద్రత మరియు హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులను కోరడం జరిగింది.