BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ

Select Suryaa Now
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా....  31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి  భానుప్రియ

తిరుపతి, మేజర్ న్యూస్:
31 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రజలంతా ఓట్లేసి తనను గెలిపిస్తే డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ హామీ ఇచ్చారు. శుక్రవారం నెహ్రూ నగర్ లో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి భానుప్రియ ఇంటింటా ప్రచారం చేశారు.  తిరుపతిలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నేతృత్వంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని మీకు అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆమె
కోరారు. మీ ఇంటి ఆడపడుచు గా ఒక సోదరిగా ఒక అక్కగా పిలిస్తే పలుకుతూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. కావున ఒకటో తేదీ జరగబోయే పోలింగ్ రోజున జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో ఆమె వెంట సతీష్ యాదవ్ తో పాటు జనసేన పార్టీకి చెందిన ప్రభాకర్, టిడిపికి చెందిన సీఎం మధుసూదన్, రేఖ, గోవిందా చారి, మధు ఆచారి సురేష్ రాజేష్ విజయలక్ష్మి ఉదయగిరి భాస్కర్ లక్ష్మీ మందపాటి  జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DWARAKA.H
PH.NO: 9705347341