అట్టహాసంగా ఎంపీటీసీ నామినేషన్లు
రామభద్రపురం, సూర్య : మండలంలో బుధవారం ఎంపీటీసీల నామినేషన్లు అట్టహాసంగా ప్రారంభవ Jయ్యాయి. నాయుడువలస సిగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్నెపల్లి ధనుంజయనాయుడు మొట్టమొదటిగా నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎల్. విష్ణుకు తమ నామినేషన్ సెట్ను అందించారు. అలాగే గొల్లలపేట స్థానం న ుంచి టీడీపీ అభ్యర్థిగా కర్రోతు తిరుపతి, తారాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోరాడ లక్ష్మణరావు తమ నామినేషన్లు వేశారు. వీరితోపాటు ఆ పార్టీకి చెందిన మరికొంతమంది కార్యకర్తలు డమ్మీ నామినేషన్ కూడా వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మడక తిరుపతినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కరణం విజయభాస్కర్, టీడీపీ సీనియర్ నాయకులు బర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలను దూరం పెట్టారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వాన్న జ్ఞాన ప్రసాద్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ తహసీల్దార్ అజ రఫీజాన్, ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు. అలాగే ఈ నామినేషన్ల ఘట్టం సజావుగా పూర్తిచే సేందుకు మండల పరిషత్ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.
రిపోర్టర్ : రామకృష్ణ, రామభద్రపురం, విజయనగరం జిల్లా.