అన్న సమారాధనకు 5 వేలు వితరణ చేసిన నేతుల స్రవంతి
తె ర్లాం, సూర్య : జనసేన పార్టీ రాజా నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త నేతుల స్రవంతి అన్న సమారాధన కార్యక్రమానికి 5 వేలు వితరణ చేశారు. రాజాం మండలం సారథి గ్రామంలో ఈనెల 21న దుర్గమ్మ తల్లి ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమానికి ఆమెకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు జనసేన పార్టీ నాయకురాలు నేతుల స్రవంతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని అందరూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు .ఈ సందర్భంగా ఆమెతో పాటు మీసేన - మీసేవ వ్యవస్థాపక అధ్యక్షులు గండి చిరంజీవి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : తిరుపతి నాయుడు, తెర్లాం, విజయనగరం జిల్లా.