అనంతపురం నగరాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.. ౼ వైయస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్.
అనంతపురంబ్యూరో (అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహీమ్ ఖాద్రి మస్జీద్( ఖబ్రస్తాన్), నూరని మస్జీద్ ల సమీపంలో వైయస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ మైనార్టీ ముఖ్య నాయకులు లతో కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి హయాంలో ముస్లిం మైనార్టీలకు జరిగిన మేలును వివరించారు.
అనంతపురం నగరాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్, వైస్సార్సీపీ రాష్ట్ర సెక్రటరీ గౌస్ బేగ్, రాష్ట్ర మైనారిటీ విభాగం సెక్రటరీ నదీమ్, మైనార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.