BREAKING
తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు హైదరాబాద్ మాజీ మేయర్ ఆలంపల్లి పోచయ్య మృతి

ఐలాండ్ లో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

Select Suryaa Now
ఐలాండ్ లో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

ఐలెండులో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.     డిప్యూటీ ఎంపీడీవో రాజేష్.          ఐ.పోలవరం, మేజర్ న్యూస్,

ఐ పోలవరం మండలంలోనీ 14 గ్రామాలను సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం కష్టించి పనిచేయాలని డిప్యూటీ ఎంపీడీవో వి రాజేష్ పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీలు పరిశుభ్రంగా ఉండడం వల్ల తద్వారా గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో చెత్తాచెదారాలను సేకరించి వర్మి కంపోస్టు కేంద్రాలకు తరలించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు వర్మీ కంపోస్ట్ తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఐ. పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీవో వి. రాజేష్ అధ్యక్షత వహించారు.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు. చెత్తను సమర్థంగా నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు.

కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ సాయి, స్టాఫ్ పవన్, శ్రీనివాస్, డిపిఆర్‌సి ఎఫ్‌టీసి కిరణ్ వర్మ, పి. శ్రీనివాస్, పి. రవి రాజ్, ఎంపిడిఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ఎం.ఎన్. మూర్తి, పంచాయతీ కార్యదర్శులు పంతగడ రవిరాజ్, విత్తనాల వెంకటరమణ, శ్రీనివాసరావు, రాయుడు సుబ్రమణ్యేశ్వరి, అనురాధ, పారిశుధ్య కార్మికులు కె. వెంకటేశ్వరరావు, కె. రాజ్‌కుమార్  పాల్గొన్నారు.