BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఎస్వీయూ వీసీ -మరో ఆరుగురు వర్సిటీ శాస్త్రవేత్తలకు చోటు

Select Suryaa Now
అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఎస్వీయూ వీసీ -మరో ఆరుగురు వర్సిటీ శాస్త్రవేత్తలకు చోటు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ప్రపంచ శాస్త్రీయ కీర్తి శిఖరాలలో స్థానం దక్కింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి రెండు శాతం శాస్త్రవేత్తలలో వీనీ టాటా నర్సింగరావుతో పాటు మరో ఆరుగురికి స్థానం లభించింది. వీరు ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఎల్సెవియర్ 2026 వరల్డ్ టాప్ టు పర్సెంట్ హైలీ సైటెడ్ సైంటిస్ట్స్ లిస్ట్ 2026లో చోటు సంపాదించారు. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ, విద్యా నైపుణ్యం పట్ల విశ్వవిద్యాలయం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తూ అద్భుతమైన విజయం వర్సిటీకి లభించింది. గుర్తింపు పొందిన ఆరుగురు శాస్త్రవేత్తలలో ఐదుగురు కెరీర్ లాంగ్ సైంటిఫిక్ ఇంపాక్ట్ కేటగిరీలోనూ ఇద్దరు సింగిల్ ఇయర్ సైంటిఫిక్ ఇంపాక్ట్ కేటగిరీలో చోటు దక్కించుకోగా, ఒక శాస్త్రవేత్త రెండు జాబితాలలోనూ కనిపించి ఘనత సాధించారు. ఈ ఘనత సాధించిన వారిలో వీసీ ప్రొఫెసర్ టాటా నరసింగ రావుతో పాటు రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సీకే.జయశంకర్, జువాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.శ్రీనివాసులురెడ్డి, రసాయనశాస్త్ర విశ్రాంత ప్రొఫెసర్ ఏ.కృష్ణయ్య, భౌతికశాస్త్రం ప్రొఫెసర్లు వి. రాజగోపాల్ రెడ్డి, వైసీ రత్నాకరం ఉన్నారు.

 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్