ఆర్టీసీ బస్సు నిలిచిపోయి ప్రయాణికుల అవస్థలు
ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు
ఎమ్మిగనూరు: సూర్య సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు రేడియేటర్ హీట్ కావడంతో మార్గమధ్యలోనే నిలిచిపోయింది. ఏపీ 21 జెడ్ 0270 సర్వీస్ నంబర్ గల బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారి 167 పైనే బస్సు లు నిలుపక పోవడం గంటల తరబడి నిలుచొవడం విడ్డురంగా వుంది.. ఇలా
బస్సు నిలిచిపోయి గంట సమయం గడిచినా ప్రత్యామ్నాయ బస్సు రాకపోవడంతో ప్రయాణికులు మండుటెండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. అత్యవసర పనులున్న పలువురు ప్రయాణికులు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయించి అదనపు చార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు వెళ్లారు. మరికొందరు బస్సు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులపై వెంటనే స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాలు మెరుగు పరచాలి అని ప్రయాణికులు కోరుతున్నారు..