ఆళ్లగడ్డ పట్టణ సిఐగా రావు బాధ్యతలు
అసంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం..
సిఐ రాము
ఫోటో. బాధ్యతలు చేపడుతున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ పట్టణ సిఐ గా డి. రాము సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
శాంతి భద్రతల సంరక్షణ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని ఆళ్లగడ్డ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము హెచ్చరించారు. సోమవారం ఆయన నూతన టౌన్ సీఐ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఆళ్లగడ్డ సీఐగా భాద్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. గతంలో ఆత్మకూరు సీఐ గా పని చేసినప్పుడు పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వగా ఐదు మంది అభ్యర్థులకు పోస్టింగ్ రావడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో కూడా మంచి క్రీడా మైదానం ఉండడంతో తాము భవిష్యత్తులో ఇక్కడ కూడా పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని సిఐ రాము తెలిపారు. ప్రజలు కేసుల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని సిఐ రాము వివరించారు. నూతన సిఐ రాము కు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.