|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 01:50 PM
శేరిలింగంపల్లి నియోజకవర్గం 106వ డివిజన్లో ప్రజల సమస్యాలను నేరుగా తెలుసుకున్న రవి యాదవ్. ఈరోజు 13 సెప్టెంబర్ 2025 శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106వ డివిజన్ గోపీ నగర్ కాలనీలో ఈ రోజు ప్రజా సమస్యలపై "మన బస్తి బాట" 3వ రోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ ఎక్స్-వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ఉదయం 7 గంటలకే గోపీ నగర్ కాలనీ చేరుకుని, ప్రజల సమస్యాలను నేరుగా విన్నారు.ప్రజలు తెలిపిన ప్రధాన సమస్యలు: తాగునీటి సరఫరా లోపం, రోడ్లు మరియు సౌకర్యాల డ్రైనేజీ సమస్యలు వీధి వారీగా, విద్యుత్ స్తంభాలపై దీపాల లోపం,మంజీరా నీటి ప్రవాహం అన్ని రుతువుల్లో, అశుభ్రత మరియు దోమల వ్యాధులు, ప్రాథమిక మౌలిక సదుపాయాల కొరత.రవి యాదవ్ మండిపడ్డారు."ప్రజల అవసరాల పట్ల స్థానిక కార్పొరేటర్ మరియు ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించడం చాలా బాధాకరం. నేను ఈ సమస్యలన్నింటినీ తవరగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాను. ఏ సమస్యను ఎదుర్కొన్నా నేను వెనుకాడను. ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందించడం నా ప్రాథమిక విధి.కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉండేది",* రవి యాదవ్ పట్టుదలకు స్థానికులు సంతోషం వ్యక్తం చేసారు, గోపీ నగర్ కాలనీ అభివృద్ధికి వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. ఈ కార్యక్రమం లో మల్లేష్ ముదిరాజ్, స్వామీనాథ్, వెంకటరెడ్డి, వెంకట చారీ, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, గడ్డం శ్రీనివాస్, సురేష్ యాదవ్, గంగాధర్ గౌడ్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి, రాజు గౌడ్, జంగయ్య, అనిల్ యాదవ్, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, నర్సింహా, దివ్య, నిరూప, నాగమణి తదితరులు పాలుగోన్నారు.