telangana
పోతిరెడ్డిపల్లిలో అర్హులకు పింఛన్ల మంజూరు
సూర్య, వీణవంక:గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాని ఒంటరి మహిళలు, వికలాంగుల పింఛన్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి దరఖాస్తు చేసుకోగానే మంజూరు కావడంతో పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. తమకు పింఛన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్‌లకు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రాపర్తి సంధ్య కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అర్హులకు పింఛన్లు రాలేదని, నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అర్హులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.