telangana
ఘనంగా ధర్మచక్ర పరివర్తన దినోత్సవం
సూర్య, పెంచికల్పేట్:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంచికల్పేట్ మండలం మంగళవారం రోజు ఎల్కపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భక్తు రామచందర్, అంబేద్కర్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.