సూర్య, సెంటినరీకాలనీ :రామగిరి, కమాన్ పూర్ మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం నిర్వహించారు. దసరాకు ముందు తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గా మాత కు పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని చేశారు. ఆయా దుర్గామాతలను తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు ప్రత్యేక వాహనం పై కూర్చోబెట్టి పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేయడం జరిగింది. భక్తులు భాజా భజంత్రీలతో పాటు మహిళలు కోలాటాల నృత్యాలతో దుర్గామాతను సాగనంపారు. ఎస్ఐలు తాడవేని శ్రీనివాస్, కొట్టే ప్రసాద్ లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పల్లె ప్రతిమ పీవీ రావు(రత్నపూర్), కొండవేన దివ్య- సుధాకర్(నాగేపల్లి), రేండ్ల శారద- కుమారస్వామి(కలవచర్ల), కొండ మంజుల- శ్రీనివాస్(చందనాపూర్), మంథని చంటి(బేగంపేట), ఇల్లందుల సంజీవ్(ఆదివారంపేట), చిందం మహేష్(పన్నూరు) , సుంకరి మహేందర్(ముస్త్యాల), వనం రాంచందర్ రావు(లద్నాపూర్), పుల్లెల భాగ్యలక్ష్మి-కొమురయ్య(రాజాపూర్), వీరగోని రమాదేవి - శ్రీనివాస్(లొంకకేసారం),రొడ్డ మౌనిక- కుమార్(నవాబుపేట), ముస్కుల నరేందర్ రెడ్డి(సుందిళ్ల), తాండ్ర యమున- శ్రీనివాస్(జల్లారం), కన్నూరి రవీందర్(బుధవారంపేట), తదితరులు పాల్గొన్నారు.