50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్‌లో మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 50 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. 50 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం సభ్యులను ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభినందించారు.