BREAKING
ముంబైలో లగ్జరీ కారు బీభత్సం: మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు కర్ణాటకలో కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: వారం రోజుల పాటు సభ జరపాలని బీజేపీ డిమాండ్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం 50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోలీసులతో ఉత్సవ సమితి సభ్యుల తోపులాట, బారికేడ్ల తొలగింపుతో రణరంగం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి.. పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రెజీనగర్ ఉపఎన్నికలో సంచలనం: పోలీసుల వేధింపులపై ఈసీని ఆశ్రయించిన ఏజేయూపీ చీఫ్ కబీర్, ప్రచారానికి బ్రేక్ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి..

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి..

మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు..


కొండ లక్ష్మణ్ వర్ధంతి వేడుకల్లో మేయర్ శ్రీనివాస్

 

06 సూర్య కరీంనగర్ ప్రతినిధి : 

 

ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లోని బైపాస్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మేయర్ శ్రీనివాస్ హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కార్పొరేటర్ వాసాల రమేష్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ,
1915 సెప్టెంబర్ 27న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన వాంకిడి ప్రాంతంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్ననాటి నుంచే జాతీయ భావాలు, ప్రజా సమస్యల పట్ల ఆకర్షితులయ్యారని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాలు, స్వాతంత్ర్యోద్యమ ప్రభావంతో రాజకీయ చైతన్యం పెంచుకున్న బాపూజీ 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు.న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రజా హక్కుల కోసం పోరాడిన బాపూజీ, తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలను రాజకీయ వేదికపై బలంగా వినిపించారని శ్రీనివాస్ తెలిపారు. 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని బలపరిచారని, అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన మొదటి నుంచే గళమెత్తారని, 1967లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారని మేయర్ అన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి ఉద్యమ బాట పట్టడం బాపూజీ రాజకీయ జీవితంలో కీలక ఘట్టమని అన్నారు.
పదవిలో కొనసాగడం కంటే తెలంగాణ కోసం ప్రజల పక్షాన నిలబడటమే ముఖ్యమని భావించి మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ, ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారని  పేర్కొన్నారు. 1972లో తిరిగి భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా జీవితంలో కొనసాగారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ తొలి దశ నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా ఉంచేందుకు బాపూజీ కృషి చేశారని, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సమయంలో తన జలదృశ్యం నివాసాన్ని ఉద్యమ కార్యకలాపాలకు ఉపయోగించుకునేలా అందించడం ద్వారా మలిదశ ఉద్యమానికి కూడా తన వంతు సహకారం అందించారని అన్నారు.తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాపూజీ 2012లో శాశ్వతంగా మన నుండి వెళ్లిపోయాడని అన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రతి ఏటా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, తెల్ల లక్ష్మీ రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, వేముల కవిత చంద్రశేఖర్, పడిశెట్టి లక్ష్మీ భూమయ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, కోశాధికారి అలసభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వోడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, పట్టణ కార్యదర్శి వంగర ఆంజనేయులు, జిల్లా నాయకులు స్వర్గం నర్సయ్య, ఎలిగేటి శ్రీనివాస్, జక్కని ప్రభాకర్, దేవసాని పాపయ్య, గడ్డం వెంకటేశం, మెతుకు కృష్ణ చైతన్య, దీకొండ లక్ష్మీనారాయణ, కలర్ సత్తన్న, అలసత్యం, చిలుక నర్సప్ప, గజవెల్లి కనకయ్య, మెతుకు వంశీకృష్ణ, అరుకాల నాగేందర్, వంగ నాగరాజు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.