వైభవంగా వెంకటేశ్వర స్వామి చక్రతీర్థం
వైభవంగా వెంకటేశ్వర స్వామి చక్రతీర్థం
జల్ పల్లి: శంషాబాద్ జోన్, జల్ పల్లి సర్కిల్ పరిధి, మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి చక్రతీర్థం వైభవంగా నిర్వహించారు. గత ఐదు రోజులుగా మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగి శుక్రవారంతో ముగిసాయి. శుక్రవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాలభోగం, ఆవాహనము, మహా పూర్ణాహుతి నిర్వహించారు. 11గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకెళ్లి అభిషేకం నిర్వహించి, చక్రతీర్థం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు చీమలదారి చెన్నయ్య. గొండ్యాల శేఖర్ ముదిరాజ్, ఎలిగపల్లి అనిత, కానుగుల భాస్కర్, గుర్జని రాధిక, అర్చకులు సుధీర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం నిర్వహించిన ధ్వజా అవరోహణంతో ఉత్సవాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో నాయకులు లాల్ సతీష్ గౌడ్, దాతలు ఎడ్ల వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్ గోపాల్ యాదవ్, దామోదర్ సచిన్ సోని, స్థానిక నాయకులు లాల్ విజయ్ గౌడ్, గుర్జని గణేష్ గౌడ్, సురేష్ గౌడ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్.