BREAKING
నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి

తండాల ఆరాధ్యదైవం హస్లీ యాడి ఆలయానికి రూ.25 వేల విరాళం

Select Suryaa Now
తండాల ఆరాధ్యదైవం హస్లీ యాడి ఆలయానికి రూ.25 వేల విరాళం

 

మండలంలోని చినవేముల బై తండాలో నిర్మాణంలో ఉన్న హస్లీ యాడి అమ్మవారి ఆలయానికి రాధాకృష్ణ ట్రస్ట్ అండగా నిలిచింది. ఆలయ నిర్మాణానికి రూ.25,000 విరాళాన్ని ట్రస్ట్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అందజేశారు.

పెద్దవేముల బాయ్ తండా పంచాయతీ పరిధిలో గిరిజనుల ఆరాధ్యదైవమైన హస్లీ యాడి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల నిమిత్తం దశరథ్ నాయక్ స్వయంగా తండాకు వెళ్లి ఆలయ కమిటీకి నగదు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ - హస్లీ యాడి తండాల సంస్కృతికి ప్రతీక అని, అమ్మవారి కృపతో తండాల్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తామని, ఆలయ పూర్తికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

ఉదారంగా సాయం అందించిన దశరథ్ నాయక్ కు ఆలయ కమిటీ సభ్యులు, తండా పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వినోద్ నాయక్, పాండు నాయక్, శీను, రమేష్, తండా వాసులు పాల్గొన్నారు.

లక్ష్మణ్ మేజర్ న్యూస్ కడ్తాల్