BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

స్థానిక కళాకారులను విస్మరించి ఉత్సవాలను జరపడం సరికాదు

Select Suryaa Now
స్థానిక కళాకారులను విస్మరించి ఉత్సవాలను జరపడం సరికాదు

సూర్య, ఇల్లందు,ఇల్లందు దసరా ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు మొండిచేయి న్యాయమా...??ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి విరామమెందుకు....?నృత్య కళాకారుల తరఫున దండు సారయ్య ఆవేదన
ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా
ఇల్లందు పట్టణంలో  దసరా ఉత్సవాలను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే  స్థానిక నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడం కూడా సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ఈసారి వారికి అవకాశం కల్పించకపోవడంపై 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నృత్య కళను నమ్ముకొని సాధన చేస్తూ, తమ ప్రతిభతో ప్రజలను అలరిస్తున్న స్థానిక కళాకారులకు దసరా ఉత్సవాల్లో అవకాశం కల్పించకపోవడం విచారకరమన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈసారి ఎందుకు పక్కనపెట్టారో సంబంధిత అధికారులు, ఉత్సవ నిర్వాహకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

*స్థానిక కళాకారులంటే ఎందుకింత నిర్లక్ష్యం?*
దసరా వంటి ప్రధాన పండుగల్లో స్థానిక కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని దండు సారయ్య పేర్కొన్నారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కోరుతున్నారని, వారికి వేదిక కల్పించడం ఎవరో చేసే ఉపకారం కాదని స్పష్టం చేశారు. స్థానికంగా ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నప్పటికీ వారికి అవకాశం కల్పించకపోవడం వారి కళా నైపుణ్యాన్ని గుర్తించనట్లేనని అన్నారు. పండుగ వేడుకల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిని ప్రోత్సహించేదెవరు? వారి ప్రతిభకు గుర్తింపు లభించేదెలా? అని ప్రశ్నించారు.

*అధికారులు స్పందించి న్యాయం చేయాలి*
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, మున్సిపల్ కమిషనర్ సందీప్ ఈ విషయంపై తక్షణమే స్పందించాలని దండు సారయ్య కోరారు. దసరా ఉత్సవాల్లో స్థానిక నృత్య కళాకారులకు ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పించేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగిస్తూ స్థానిక కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.

స్థానిక కళాకారులను విస్మరించి ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ దసరా వేడుకల్లో భాగస్వాములను చేయాలని దండు సారయ్య స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి స్థానిక నృత్య కళాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు