BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

సింగరేణి లాభాలు తగ్గడంపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి @మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Select Suryaa Now
సింగరేణి లాభాలు తగ్గడంపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి         @మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

 

*మిర్యాలగూడ, మేజర్ న్యూస్:*
మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో. నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సింగరేణి సంస్థలో లాభాల తగ్గుదల, బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, రైతుల సమస్యలు, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్ రంగానికి కీలకమైన సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక వివరాలను ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాలు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ పూర్తి ఆర్థిక నివేదిక, ఆడిట్ వివరాలను విడుదల చేయాలని కోరారు.

*సింగరేణి ఆర్థిక లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలి*
పన్నులకు ముందు లాభం, పన్నుల అనంతర లాభం, ప్రొవిజన్లు, ఇతర కేటాయింపుల వివరాలను వెల్లడించాలని, కార్మికులకు లాభాల వాటా పెంపుపై పునఃపరిశీలన జరపాలని అన్నారు. సోలార్ ప్లాంట్లు, డీజిల్, డిటోనేటర్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వాటాల విక్రయం, ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

*బొగ్గు ఉత్పత్తి తగ్గితే విద్యుత్ రంగంపై ప్రభావం*
సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని, గనుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, భవిష్యత్ ఉత్పత్తి లక్ష్యాలపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఎంత మేరకు ఉపయోగపడుతోంది, ఉత్పత్తి తగ్గుదల వల్ల విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనే వివరాలను గణాంకాలతో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

*రైతులకు సాగునీరు, పంటలకు విద్యుత్ అందించాలి*
రైతులకు సాగునీరు, పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీరు, విద్యుత్ అందక పంటలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడకుండా చూడాలని, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేయాలని అన్నారు.

*కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించాలి*
సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, గృహ వసతి, లాభాల వాటా వంటి సంక్షేమ ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు.

*ప్రభుత్వంప్రజలకుసమాధానం చెప్పాలి*
సింగరేణి లాభాల తగ్గుదల, బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, రైతుల సమస్యలు, కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండి. యూసుఫ్, జొన్నలగడ్డ రంగారెడ్డి, ఎండి. ఇలియాస్ ఖాన్, ధనావత్ బాలాజీ నాయక్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎండి. మగ్దూం పాషా, అంగోతు హతిరాం నాయక్, ఎండి. మాజీద్, కుర్రా శ్రీను నాయక్, దీపిక విజయ్, గుడిసె దుర్గా ప్రసాద్, తిరుమలగిరి వజ్రం, పునాటి లక్ష్మీనారాయణ, పీసీకే ప్రసాద్, వడ్డేపల్లి శ్రీనివాస్, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టా మల్లేష్ గౌడ్, నేనావత్ కోట్యా నాయక్, కనిగిరి శ్రీను, అలకాని రమణ, రామావత్ వినోద్ నాయక్, కాతోజు వినోద్ కుమార్, చంద్రశేఖర్, షేక్ మస్తాన్, షేక్ ఫయాజ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.