BREAKING
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం 50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోలీసులతో ఉత్సవ సమితి సభ్యుల తోపులాట, బారికేడ్ల తొలగింపుతో రణరంగం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి.. పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రెజీనగర్ ఉపఎన్నికలో సంచలనం: పోలీసుల వేధింపులపై ఈసీని ఆశ్రయించిన ఏజేయూపీ చీఫ్ కబీర్, ప్రచారానికి బ్రేక్ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శకుడు అట్లీకి అల్లు అర్జున్ జన్మదిన శుభాకాంక్షలు: 'రాకా'తో మరిన్ని అద్భుతాలు సృష్టిద్దామంటూ ఐకాన్ స్టార్ పోస్ట్ సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

*సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు.

 కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లు.*

*జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.*

మహబూబాబాద్, సెప్టెంబర్ 21, మేజర్ న్యూస్,

మహబూబాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను సెప్టెంబర్ 26 న కంబాలపల్లి చెరువు వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని సహజ సౌందర్యం, చెరువులు, జలపాతాలు, చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు, జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. కంబాలపల్లి చెరువుతో పాటు బయ్యారం చెరువు, గుంజేడు ముసలమ్మ దేవాలయం, కురవి వీరభద్రస్వామి దేవాలయం, బీముడి పాదం జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సుందరీకరణ, సందర్శకులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కళలు, సంప్రదాయాలు మరియు జిల్లా సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, స్థానిక కళాకారులు, హస్తకళాకారులు, చిన్న వ్యాపారులు మరియు ఇతర వర్గాలకు ఆర్థిక అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పర్యాటక రంగానికి చెందినవారు, అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. మహబూబాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యం, చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేసి, పర్యాటక రంగం ద్వారా స్థానికంగా ఉపాధి మరియు ఆర్థిక అవకాశాలను పెంపొందించడమే లక్ష్యం” అని జిల్లా కలెక్టర్ తెలిపారు.