సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సులభం..భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సులభం..భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్.
దుమ్ముగూడెం,సూర్య (మేజర్ న్యూస్)::
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించి,స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగరం, ములకలపాడు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను ప్రాంరంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించడానికి నేరాల ఛేదనకు ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించిన స్థానిక వ్యాపారులను ఈ సందర్భంగా ఆయన సన్మానించి,అభినందనలు తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పరిసరాలను డీఎస్పీ సమగ్రంగా పరిశీలించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా స్పందించి, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య,ఎస్ఐ జగన్మోహన్ చారి,పోలీస్ సిబ్బంది,వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.