సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. ఆటపాటలతో సందడి
కొల్చారం …తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చివరగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి, సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసి గౌరమ్మకు వీడ్కోలు పలికారు.