మొబైల్ రికవరీ బాధితునికి అప్పగించిన ఎస్హెచ్ఓ
మొబైల్ రికవరీ బాధితునికి అప్పగించిన ఎస్హెచ్ఓ
సూర్య అశ్వరావుపేట, అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి అప్పగించిన అశ్వారావుపేట పోలీసులు.
ఈ నెల 11వ తేదీన బాధితుడు నామినేని రాజేష్ S/o వెంకటేష్, నెహ్రూ నగర్, అశ్వారావుపేటకు చెందిన వ్యక్తి తన మొబైల్ ను పోగొట్టుకోగా అశ్వారావుపేట పోలీసులను సంప్రదించారు. దీనిపై స్పందించిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ను రికవరీ చేసి ఆదివారం బాధితునికి అందజేశారు.బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సులభంగా రికవరీ చేయవచ్చని ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట