BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

మౌన దీక్షలో ఆరోగ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె

Select Suryaa Now
మౌన దీక్షలో ఆరోగ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి,కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని జాతీయ ఆరోగ్య విషయంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల నిరవధిక సమ్మె ఆరవ రోజుకు చేరింది. ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఉద్యోగులు మౌన దీక్ష చేపట్టి నోటికి నల్లని రిబ్బన్ ధరించారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లపై విన్నవించామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని అందుకనే ఈరోజు తాము మౌనంగా ఉన్నామని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న తమ శాంతియుత నిరవధిక సమ్మెను ప్రభుత్వం గుర్తించాలని, తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని జేఏసీ నాయకులు కోరారు. సద్దుల బతుకమ్మ పండుగను సైతం లెక్కచేయకుండా మహిళా ఉద్యోగులు నేడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తే అదే మాకు పెద్ద పండుగని ఆవేదన వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్, ప్రధాన కార్యదర్శి బట్టు పద్మజ, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జేఏసీ నాయకులు డా.మీనాక్షి, డా.సుధాకర్, డా.రవళి, డా.రాహుల్, డా.రాజశేఖర్, అఖిల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.