నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర
నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర
పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
నియోజవర్గం ఇంచార్జ్
ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ ; నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్వహించిన విజయోత్సవ వికాస్ యాత్ర ఘనంగా కొనసాగిందినర్సాపూర్ పట్టణంలోని శ్రీ మల్లన గుడి వద్ద ప్రారంభమైన వికాస్ యాత్ర నర్సాపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూప్రజా ప్రభుత్వం ఏర్పడిన 1,000 రోజుల్లో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వికాస్ యాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్..ప్రజా ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే కాంగ్రెస్ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు.వికాస్ యాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలకు ఆవుల రాజిరెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..