BREAKING
బిజెపి నాయకుల అరెస్ట్. ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దైవిక రహస్యాల నేపథ్యంలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ఉత్కంఠభరిత ప్రయాణం! తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ నిబంధన.. పెనుభారంగా మారనున్న వాణిజ్య పన్నులు.. సామాన్యులపై పెరగనున్న ఛార్జీల మోత రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం గ్రామీణ నేపధ్యంలో సరికొత్త యాక్షన్ డ్రామా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ' శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్.. లండన్ ఉద్యోగాల పేరిట కోట్ల దోపిడీ కేసులో చర్యలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి వెండితెరపై మరోసారి గూఢచారి పరాక్రమం: భారీ అంచనాల మధ్య రానున్న కార్తీ 'సర్దార్ 2' యూకే వీసా స్కామ్‌లో ‘నందూస్ వరల్డ్’ దంపతులు.. పోలీసుల అదుపులో కీలక నిందితులు! నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై ట్విస్ట్.. మార్పు తప్పదా? నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

Select Suryaa Now
ఎమ్మెల్యే సునీత రెడ్డిని   ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

ఎమ్మెల్యే సునీత రెడ్డిని 
 ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

నర్సాపూర్ వెనుకబాటుకు కారణంఎమ్మెల్యే సునీత రెడ్డి 
 
 డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,.....
 కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి..…

నర్సాపూర్ : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డ్రామాలు ఆడుతుందని
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వికాస యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ఏమీ జరగలేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి తప్పును ఒప్పుకోవాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను హరీష్ రావు నర్సాపూర్ నుండి తరలించారని మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేసిన ద్రోహం ఎవరు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని, కుల వృత్తుల పేరిట మభ్య పెట్టారన్నారు. సునీత రెడ్డి తో ఏగలేకనే హరీష్ రావు చెంతకు బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్తున్నారని చురకలు అంటించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కల అని, రేవంత్ రెడ్డి రానివ్వడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ గుప్తా, సురేష్ నాయక్, రాజేష్, ఉదయ్ కుమార్ శివ కుమార్ ఆంజనేయులు గౌడ్
కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.