BREAKING
నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పెట్రోల్–డీజిల్ ధరలు స్థిరం.. క్రూడ్ ఆయిల్‌పై అందరి చూపు! కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే! వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? పండితులు ఏం చెబుతున్నారు? తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్!

మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం

Select Suryaa Now
మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం

అసెంబ్లీ వద్ద

మహిళా ఎమ్మెల్యేలపై..
పోలీసుల తీరు అమానుషం!

చీర లాగడంతో సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన 

సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని లాగిన ఘటనపై brs శ్రేణుల ఆగ్రహం

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 7) : అసెంబ్లీకి హాజరయ్యేందుకు వస్తున్న మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. భద్రత పేరుతో మహిళా ఎమ్మెల్యేలపై ప్రదర్శించిన కర్కశ వైఖరి రాజకీయ వర్గాల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. మహిళా గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఈ ఘటనలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఆమె చీరను లాగడంతో తీవ్ర మనోవేదనకు గురైన సునీత అక్కడికక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కుదిపేశాయి.

ఇదే సమయంలో మరో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులు మరింత దురుసుగా ప్రవర్తించారు. ఆమెను జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మహిళా ప్రతినిధుల పట్ల కనీస మర్యాద కూడా పాటించ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనలపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రజల తరఫున అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన మహిళా ప్రజా ప్రతినిధులనే అవమానించడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మహిళా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రశ్నించారు.

మొత్తంగా ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారి తీస్తూ, పోలీసు వ్యవస్థ పనితీరుపై మళ్లీ చర్చను రేకెత్తించింది.