BREAKING
తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే! వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? పండితులు ఏం చెబుతున్నారు? తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్! పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశ్వని కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం మిషన్ మోడ్‌లోకి భారతదేశపు మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం: అమిత్ షా శాంతి, ప్రకృతి సామరస్యాన్ని కాంక్షిస్తూ ప్రధాని మోదీ సంస్కృత శ్లోకం పోస్ట్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన IPOల హడావిడి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొత్త డిస్ట్రాయర్ అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగం వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్ అవుట్‌పోస్టుల తొలగింపునకు ఆదేశం

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం

Select Suryaa Now
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం

కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు తీవ్ర అనాగరికంగా, అవమానకరంగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.

అసెంబ్లీ వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఆమె చీర పట్టుకుని లాగుతూ దౌర్జన్యానికి దిగారని నేతలు తెలిపారు. ప్రజాప్రతినిధులని, కనీసం మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర మనస్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఈ రకమైన అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.