BREAKING
తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్! పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశ్వని కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం మిషన్ మోడ్‌లోకి భారతదేశపు మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం: అమిత్ షా శాంతి, ప్రకృతి సామరస్యాన్ని కాంక్షిస్తూ ప్రధాని మోదీ సంస్కృత శ్లోకం పోస్ట్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన IPOల హడావిడి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొత్త డిస్ట్రాయర్ అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగం వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్ అవుట్‌పోస్టుల తొలగింపునకు ఆదేశం పునరాగమన విజయంతో చెల్సియాను ఓడించిన ఆర్సెనల్ ఢిల్లీ భవనం కూలిపోవడం ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య జర్మన్ రాష్ట్ర ఎన్నికలలో తీవ్ర కుడిపక్ష ఏఎఫ్‌డీ చారిత్రాత్మక విజయం

ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన

Select Suryaa Now
ఎంపీడీవో కార్యాలయానికి తాళం... బిఆర్ఎస్ నిరసన


ప్రజావాణి రోజే అధికారుల గైర్హాజరు.. సస్పెండ్ చేయాలని డిమాండ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: కోటిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమయపాలనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలు దాటినా కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉన్నప్పటికీ ఎంపీడీవో, ఎంపీవోతో పాటు పలువురు సిబ్బంది సమయానికి కార్యాలయానికి హాజరు కాలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. 10.30 గంటలు దాటినా కార్యాలయంలో అటెండర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.

ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించేందుకు కార్యాలయానికి వస్తుంటే అధికారులు సమయపాలన పాటించకపోవడం బాధ్యతారాహిత్యమని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. విధులకు సమయానికి హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్, మాజీ సర్పంచ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.